ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొత్తఇండ్లు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున సుబ్రహ్మణ్యం (71) అనే రైతు పొలానికి వెళ్లగా.. అదే సమయంలో అటు వైపుగా వస్తున్న ఏనుగుల గుంపు అతన్ని తొక్కి చంపేశాయి. అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే సుబ్రహ్మణ్యం ఏనుగుల గుంపునకు బలయ్యాడని స్థానికులు ఆందోళనకు దిగారు.
పొలానికి వెళ్లిన రైతును తొక్కి చంపిన ఏనుగుల గుంపు.. - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు
ఏనుగుల గుంపునకు ఓ వృద్ధ రైతు బలయ్యాడు. పొలానికి వెళ్లిన రైతును ఏనుగుల గుంపు తొక్కి చంపిన విషాదకర ఘటన.. ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో జరిగింది.
elephant attack on farmer at chittoor district
వారం రోజులుగా ఇదే ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నా అటవీశాఖ అధికారులు చొరవ చూపడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు ఇంతకు ముందు అనేక సార్లు జరిగాయని.. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కలెక్టర్ వచ్చేంతవరకు తమ ధర్నా కొనసాగుతుందని రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఇవీ చదవండి: