ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ప్రధాన పట్టణమైన నర్సీపట్నంలో విద్యుత్ ప్రమాదంతో తండ్రీకుమారుడు మృతి చెందారు. కృష్ణా బజారు సమీపంలోని ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో ఇంట్లో ఊపిరాడని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తండ్రీకుమారుడు మృత్యువాత పడగా.. భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం.. విద్యుదాఘాతంతో తండ్రీకుమారుడి మృతి
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో విద్యుత్ ప్రమాదం జరిగింది. జిల్లాలోని ప్రధాన పట్టణమైన నర్సీపట్నంలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి.. తండ్రీకుమారుడు మృత్యువాతపడ్డారు. భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
shot circuit in Narsipatnam