ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని ఎస్బీఐ సమీపంలోని ఏటీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఏటీఎం, ఏసీలు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్.. ఏటీఎంలో ఎగిసిన మంటలు - పామిడి వద్ద ఏటీఎంలో ఎగసిపడుతున్న మంటలు
షార్ట్ సర్క్యూట్ వల్ల ఏటీఎంలో మంటలు చెలరేగాయి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఏటీఎం, ఏసీలు కాలి బూడిదయ్యాయి.
షార్ట్ సర్క్యూట్..ఏటీఎంలో ఎగిసిన మంటలు
రద్దీ తక్కువగా ఉండటంతో ఎటువంటి ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు అదుపుచేశారు. ఈ ఘటనపై పామిడి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏటీఎంలో ఎంత నగదు ఉందో తెలియాల్సి ఉంది.