Elder brother killed younger brother: ఖమ్మం జిల్లాలోని వైరా మండలం రెబ్బవరంలో ప్రశాంతంగా ఉన్న పల్లెలో తమ్ముడిని అత్యంత కిరాతకంగా అన్న హత్య చేసిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. రాత్రి నిద్రమత్తులో తమ్ముడు సాధం నరేష్‌ను.. తన సొంత అన్న అయిన రామకృష్ణ గొడ్డలితో అతి కిరాతకంగా నరికి హత్య చేశాడు.
తమ్ముడిని హత్య చేసిన అన్నయ్య.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.. - వివాహేతర సంబంధంతో యువకుడి హత్య
Elder brother killed younger brother: ఖమ్మం జిల్లాలో తోడబుట్టిన తమ్ముడిని అన్న అతి కిరాతకంగా హత్యచేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ.. తన తమ్ముడు నిద్రలో ఉండగా తలపై గొడ్డలితో నరికి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.
Murder case
తెల్లవారి జామున ఇది గమనించిన స్థానికులు భయభ్రాంతికి గురై స్థానికి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలిస్తుండగా.. రామకృష్ణ పోలీసుల ఎదుట లొంగిపోయి.. తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. రామకృష్ణ హంతకుడుగా మారడానికి నిందితుడి భార్యకి.. అతడి తమ్ముడికి ఉన్న వివాహేతర సంబంధం కారణం కావచ్చునని స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: