మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలోని వసంతపురి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కరింగుళ్ల అర్జున్ కుమార్(14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. చదువుకోవడం ఇష్టం లేని అర్జున్.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన బాలుడి తల్లి.. స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు.
చదువు వద్దని ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య - తెలంగాణ నేర వార్తలు
చదువంటే ఇష్టం లేని ఓ మైనర్ బాలుడు.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్కాజ్‌గిరి పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
చదువంటే విరక్తితోనే తన కుమారుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అర్జున్ తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:కారును ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి