ORR Accident Hyderabad Today :ఓఆర్ఆర్ వద్ద అమెరికా తరహా ప్రమాదం.. ఒకదాన్నొకటి 8 కార్లు ఢీ - road accidents today in Hyderabad
![ORR Accident Hyderabad Today :ఓఆర్ఆర్ వద్ద అమెరికా తరహా ప్రమాదం.. ఒకదాన్నొకటి 8 కార్లు ఢీ పెద్దఅంబర్‌పేట్ ఓఆర్ఆర్పై ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13685129-thumbnail-3x2-a.jpg)
10:01 November 20
పెద్దఅంబర్‌పేట్ ఓఆర్ఆర్ వద్ద ప్రమాదం
రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ రింగురోడ్డు వద్ద అమెరికా తరహా రోడ్డు ప్రమాదం(ORR Accident hyderabad today) చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించుకోవడానికి కారు సడన్ బ్రేక్ వేయడం వల్ల దాని వెనుక వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది కార్లు(car accident today hyderabad) పరస్పరం ఢీకొన్నాయి. ఈ వాహనాల బ్యానెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం తప్పడం వల్ల అందరు ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవలే తాను కారు కొన్నానని.. ఈ ప్రమాదంలో తన కారు బ్యానెట్ పూర్తిగా దెబ్బతిన్నదని ఓ వాహనదారుడు విచారం వ్యక్తం చేశాడు. కానీ ఎవరికి ఏం కాలేదని ఊపిరి పీల్చుకున్నారు.
- ఇదీ చదవండి : వరదలో కొట్టుకుపోయిన మూడు బస్సులు.. 12 మంది దుర్మరణం