ఈటల రాజేందర్‌కు అన్యాయం జరిగిందంటూ మంచిర్యాల జిల్లా మందమర్రిలో అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. మందమర్రి అంగడి బజార్ ప్రాంతానికి చెందిన వెంకటేష్ ముదిరాజ్‌కు మొదటి నుంచి ఈటల రాజేందర్ అంటే ఎనలేని అభిమానం. ఆయన పేరుపై సేవా కార్యక్రమాలు కూడా చేశాడు.
ఈటలకు అన్యాయం జరిగిందంటూ అభిమాని ఆత్మహత్యాయత్నం - telangana varthalu
ఈటలకు అన్యాయం జరగిందంటూ అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటుచేసుకుంది. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ అభిమాని ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. స్థానికులు అడ్డుకోగా.. లారీ కిందకు చేరి నిరసన తెలిపాడు.
ఈటలకు అన్యాయం జరిగిందంటూ అభిమాని ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్‌లో ఉండి క్యాటరింగ్ పనులు చేసే వెంకటేష్ రెండు రోజుల క్రితం మందమర్రికి వచ్చాడు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం అటుగా వెళ్తున్న లారీ కిందకు చేరి తన నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడకు చేరుకుని వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: కదులుతున్న బస్సు కిందపడి కొవిడ్ బాధితుడు బలవన్మరణం