తెలంగాణ

telangana

ETV Bharat / crime

Karvy share: రూ.700 కోట్ల విలువైన కార్వీ షేర్లను స్తంభింపజేసిన ఈడీ - కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ

ed-stopped-700-crores-of-karvy-shares
ed-stopped-700-crores-of-karvy-shares

By

Published : Sep 25, 2021, 1:35 PM IST

Updated : Sep 25, 2021, 3:56 PM IST

13:32 September 25

Karvy share: కార్వీ షేర్లను స్తంభింపజేసిన ఈడీ

కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అక్రమాలపై ఈడీ దర్యాప్తు (ENFORCEMENT DIRECTORATE INVESTIGATION ON KARVY SCAM) కొనసాగుతోంది. ప్రస్తుతానికి రూ.700 కోట్ల విలువైన కార్వీ షేర్లను ఈడీ స్తంభింపజేసింది. తన షేర్లను పార్థసారథి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్థసారథి పలు బ్యాంకుల నుంచి 2,873 కోట్ల రూపాయలు రుణం తీసుకొని, తిరిగి చెల్లించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ సీసీఎస్​లో హెచ్​డీఎఫ్​సీ, ఇండన్ ఇండ్, సైబరాబాద్​లో ఐసీఐసీఐ బ్యాంకులు ఫిర్యాదు చేశాయని చెప్పారు. పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కార్వీ సంస్థపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. 

ఈ నెల 22వ తేదీన కార్వీ సంస్థకు చెందిన పలు కార్యాలయాలతో పాటు.. పార్థసారథి ఇంట్లో తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలతో పాటు... పెన్ డ్రైవ్​లు, లాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. పెట్టుబడిదారులకు చెందిన షేర్లను కార్వీ ఖాతాలోకి మళ్లించుకొని వాటిని బ్యాంకులో తనఖా పెట్టి పార్థసారథి రుణం తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని 9 డొల్ల కంపెనీలకు మళ్లించడంతో పాటు.... పలు స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. కార్వీ నిర్వాహకుల నిధుల మళ్లింపు అక్రమాలపై ఈడీ లోతుగా ఆరా తీస్తోంది. వినియోగదారుల షేర్లను అక్రమంగా బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా రుణంగా తీసుకున్న కోట్ల రూపాయల నిధుల్ని ఎక్కడికి మళ్లించారనే అంశంపై కూపీ లాగుతోంది. ఇలా సేకరించిన రుణాల మొత్తం రూ.1,200 కోట్లకు పైగానే ఉంటుందని తేలడంతో ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 

సంబంధిత కథనాలు..

Last Updated : Sep 25, 2021, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details