ED raids in Hyderabad: ముసద్దీలాల్ జెమ్స్ ఆండ్ జువెల్లర్స్ షోరూంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎర్రమంజిల్‌లోని షోరూంతో పాటు.. హైదరాబాద్‌లోని మిగతా షోరూంలు, విజయవాడ, గుంటూరులోనూ సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3గంటల నుంచే ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, విజయవాడ, గుంటూరుకు చేరుకున్నారు. ఎర్రమంజిల్‌లోని ముసద్దీలాల్ జూవెల్లర్స్‌లో 8మంది అధికారులు షోరూంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. షోరూంలోకి ఇతరులను ఎవరినీ అనుమతించడం లేదు. 6గురు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ భద్రత నడుమ ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.
మనీలాండరింగ్ కేసు.. హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు - money landering
12:30 October 17
మనీలాండరింగ్ కేసు.. హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు
గతంలో ముసద్దీలాల్ జువెల్లర్స్‌పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. నోట్ల రద్దు సమయంలో నకిలీ బిల్లులు సృష్టించి నగదు చలామణి చేశారన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి... 130కోట్ల రూపాయల ఆస్తులను గతేడాది ఫిబ్రవరిలో అటాచ్ చేశారు. నోట్ల రద్దు సమయంలో ముసద్దీలాల్ జువెల్లర్స్‌కు చెందిన యాజమాన్యం డబ్బులను వారి ఖాతాలో భారీ ఎత్తున డిపాజిట్ చేశారు. ఈ డబ్బంతా బంగారు విక్రయం ద్వారా వచ్చినట్లు పత్రాలు చూపించారు.
నవంబర్ 8, 2016న పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు మోదీ రాత్రి 8 గంటలకు ప్రకటించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే దాదాపు 6వేల మందికి బంగారం విక్రయించగా 100కోట్ల పైగా నగదు వచ్చినట్లు చూపించారు. ఈ నగదునంతా... తిరిగి బులియన్ మార్కెట్‌లో బంగారంలో పెట్టుబడి పెట్టి... ఆ బంగారాన్ని మార్కెట్లో అధిక లాభాలకు విక్రయించినట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఆ కేసు కొనసాగుతోంది. ఇప్పుడు కొనసాగుతున్న ఈడీ సోదాలు.. దేనికి సంబంధించినవే విషయాన్ని అటు ఈడీ అధికారులు కానీ.. ఇటు ముసద్దీలాల్ జువెల్లర్స్ యాజమాన్యం నిర్దారించలేదు.
ఇవీ చదవండి: