తెలంగాణ

telangana

ETV Bharat / crime

దిల్లీ మద్యం కేసు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్టు - Amit Arora arrested in Delhi liquor case

delhi liquor case
delhi liquor case

By

Published : Nov 30, 2022, 10:03 AM IST

Updated : Nov 30, 2022, 2:13 PM IST

07:59 November 30

దిల్లీ మద్యం కుంభకోణంలో మరో వ్యక్తి అరెస్టు

Amit Arora in Delhi liquor case: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారివేత్త అమిత్​ అరోరాను ఈడీ అధికారులు ఈరోజు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గుర్ని ఈడీ అధికారులు అరెస్టు చేయగా.. అరెస్టు చేసిన వారిలో శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌ బాబు ఉన్నారు.

మరో వైపు దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై డిసెంబర్​ 15న రౌస్​ అవెన్యూ ప్రత్యేక కోర్టు విచారించనుంది. ఏడుగురు నిందితులపై తొలి ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ.. ఛార్జిషీట్‌లో విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, సమీర్‌ మహేంద్రు, అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్‌, ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కుల్‌దీప్‌సింగ్‌ పేర్లు ఉన్నాయి. మరో వైపు సీబీఐ ఛార్జిషీట్‌లో ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేంద్ర సింగ్‌ పేరు ఆమోదించాలో లేదో డిసెంబర్ 15న కోర్టు నిర్ణయం తీసుకోనుంది. సుమారు 10 వేల పేజీలతో ఈనెల 25న సీబీఐ ప్రత్యేక ఛార్జిషీట్​ వేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

Last Updated : Nov 30, 2022, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details