LOan apps case: లోన్ యాప్‌ల కేసులో దిల్లీలోని హెచ్ఏఆర్ అసోసియేట్స్ ఛార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. బోగస్ బిల్లులతో విదేశాలకు సొమ్ము తరలించడంలో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ పేర్కొంది. రవికుమార్‌ను రేపటి నుంచి ఈనెల 9 వరకు ఈడీ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. గేమింగ్, డేటింగ్ యాప్‌ల పేరిట భారత్‌లో లక్షల మందిని మోసం చేశారన్న అభియోగంపై చైనీయులకు చెందిన లింక్యూన్ టెక్నాలజీ, డాకీపే టెక్నాలజీ సంస్థలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ed arrested chartered accountant : వెంట్రుకల వ్యాపారులకు హవాలా చెల్లింపులు, క్రిప్టో కరెన్సీ కొనుగోలు, తదితర రూపాల్లో వేల కోట్ల రూపాయలు అక్రమంగా దేశం మళ్లించారన్న మనీలాండరింగ్ అభియోగాలపై ఈడీ విచారణ జరుపుతోంది. బోగస్ విమాన బిల్లులు, నకిలీ క్లౌడ్ అద్దె బిల్లులు తయారు చేసి పలు బ్యాంకుల ద్వారా విదేశాలకు మళ్లించినట్లు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈడీ గుర్తించింది. దర్యాప్తు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ సీసీఎస్ కేసు నమోదు చేసింది. సీసీఎస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా బోగస్ బిల్లుల ద్వారా విదేశాలకు మళ్లింపుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. బోగస్ బిల్లుల ద్వారా సొమ్ము మళ్లింపులో చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది.