సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్లో హోలీ వేడుకల్లో విషాదం సంభవించింది. హొలీ సంబురాల్లో రంగులు చల్లుకున్న అనంతరం పలువురు బాలురు స్నానానికి చెరువులోకి వెళ్లారు.
హోలీ వేడుకల్లో అపశృతి.. ఓ బాలుడు మృతి - Disruption during Holi celebrations
హోలీ పండుగ వేళ ఆ గ్రామంలో విషాదం నెలకొంది. స్నేహితులతో ఈతకు వెళ్లిన చిన్నారుల్లో ఓ బాలుడు మృతి చెందగా.. మరో బాలుడు మునిగిపోతుండగా స్థానికులు రక్షించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
హోలీ వేడుకల్లో అపశృతి.. ఓ బాలుడు మృతి
వారిలో ఓ 12 ఏళ్ల యువకుడు చెరువులో మునిగి దుర్మరణం చెందాడు. మరో బాలుడు చెరువులో మునుగుతుండగా స్థానికులు రక్షించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణఖేడ్ ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి :నోముల వారసుడికే నాగార్జునసాగర్ టికెట్