తెలంగాణ

telangana

ETV Bharat / crime

మన్యంలో ఘోరం: మూగ బాలికపై సామూహిక అత్యాచారం! - విశాఖ మన్యంలో మూగ బాలికపై అత్యాచారం

మహిళలు, బాలికల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఏపీలో దిశ చట్టం అమల్లోకి వచ్చినా అత్యాచారాలు మాత్రం ఆగటం లేదు. ఏపీలోని విశాఖ ఏజెన్సీలో ఓ మూగ బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

dumb girl raped at vishaka agency
dumb girl raped at vishaka agency

By

Published : May 1, 2021, 10:21 PM IST

ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీకి చెందిన ఓ మూగ బాలిక (17)... మార్చి 29న జి. మాడుగుల మండలం పెదలోచలిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి ఆటోలో తిరుగు ప్రయాణమై.. డేగలరాయికు వచ్చే క్రమంలో ఆటోలోని ఇద్దరు వ్యక్తులు బాలికను సమీపంలోని కొండ పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం డేగలరాయి సెంటర్​లో బాలికను విడిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని సైగల ద్వారా తల్లికి చెప్పింది. జి. మాడుగుల పోలీసు స్టేషన్​లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై వివరణ కోరగా.. విచారణ జరుపుతున్నట్లు పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ వెల్లడించారు.

ఇదీ చదవండి:'కొవిడ్​ సోకిన వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు రాదు..'

ABOUT THE AUTHOR

...view details