తెలంగాణ

telangana

ETV Bharat / crime

హుజూర్​నగర్​లో 30 కేజీల గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్ - తెలంగాణ వార్తలు

హుజూర్​నగర్​ పట్టణంలో ఓ ఇంట్లో 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కోదాడ డీఎస్పీ రఘు తెలిపారు. దీని విలువ రూ.4లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

ganja seized, dsp press meet
హుజూర్​నగర్​లో గంజాయి పట్టివేత, డీఎస్పీ మీడియా సమావేశం

By

Published : Mar 31, 2021, 2:28 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ పట్టణంలోని ఓ ఇంట్లో 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని కోదాడ డీఎస్పీ రఘు తెలిపారు. దీని విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు హుజూర్​నగర్ పోలీస్ స్టేషన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

స్థానికంగా తనిఖీలు నిర్వహించామని.. పట్టణం నుంచి గంజాయిని రవాణా చేస్తున్నట్లు తేలిందని తెలిపారు. నిందితులను రిమాండ్​కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న సీఐ రాఘవరావు, ఎస్సై వెంకటరెడ్డి, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.

ఇదీ చదవండి:అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details