హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మందుబాబు హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో తనను తాను గాయపర్చుకున్నాడు. ఉప్పుగూడ జండా ప్రాంతంలోని వైన్స్ సమీపంలో తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు.
మద్యంమత్తులో తనను తాను గాయపర్చుకుని మందుబాబు హల్‌చల్ - pathabasthi crime news
సుక్క నోట్లోపడితే చాలు కొందరు మందుబాబులు ఏం చేస్తారో వారికే తెలియదు. ఇలాగే ఓ వ్యక్తి మద్యం మత్తులో తనను తాను గాయపర్చుకున్నాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండగా.. రోడ్డుపై అటూఇటూ తిరుగుతూ అక్కడున్న వారిని హడలెత్తించాడు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి మందుబాబును ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
మందుబాబు హల్‌చల్
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయాలతో ఉన్న మందుబాబును అంబులెన్స్ ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఎవరు, ఇలా ఎందుకు ప్రవర్తించాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం సీసా పగులగొట్టి, తనని తాను గాయపర్చుకున్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు.
ఇదీ చూడండి: క్రికెట్ బుకీ అరెస్టు.. 10 లక్షల నగదు, ఫోన్లు స్వాధీనం