తెలంగాణ

telangana

ETV Bharat / crime

నేను డాక్టర్‌ని.. నన్నే ఆపుతారా.. మీ సంగతి చెప్తా! - హన్మకొండలో మందుబాబు హల్‌చల్

Drunken man Hulchul in Hanamkonda : 'నేను డాక్టర్‌ని... కావాలంటే ఆసుపత్రి డేటాబేస్‌లో చెక్ చేయండి. నా ఫ్యామిలీకి కాల్ చేయండి నేనేంటో వాళ్లు చెబుతారు.' అంటూ మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్‌చల్‌ సృష్టించిన ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వ్యక్తి గంటపాటు పోలీసులకు చుక్కలు చూపించాడు.

Drunken man Hulchul in Hanamkonda
Drunken man Hulchul in Hanamkonda

By

Published : Apr 26, 2022, 10:33 AM IST

Updated : Apr 26, 2022, 12:05 PM IST

Drunken man Hulchul in Hanamkonda : హనుమకొండలో మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. సుబేదారి స్టేషన్‌ పరిధిలో నిన్నరాత్రి పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో హంగామా చేస్తున్న ఓ వ్యక్తిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, పరీక్షల కోసం ఎంజీఎం ఆసుపత్రికి తీసుకురాగా.... ఆస్పత్రిలో డాక్టర్‌ కుర్చీలో కూర్చున్నాడు. తాను ఎంజీఎం వైద్యుడినంటూ... అక్కడున్న వారికి చుక్కలు చూపించాడు. వైద్య పరీక్షలకు సహకరించకపోగా... నన్నే ఆపుతారా.. అంటూ పోలీసులకు హెచ్చరికలు చేశాడు. చివరకు బలవంతంగా అతడిని అదుపులోకి తీసుకొని.. ఆసుపత్రికి తరలించి రక్తంలో ఎంతో మోతాదు ఆల్కహాల్ ఉందో పరీక్షలు నిర్వహించి స్టేషన్​కు తరలించారు.

నేను డాక్టర్‌ని.. నన్నే ఆపుతారా.. మీ సంగతి చెప్తా!
Last Updated : Apr 26, 2022, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details