Bike Burnt in Nampally : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనాన్ని తగులబెట్టాడు. సోమవారం రాత్రి హైదరాబాద్ నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో పాతబస్తీకి చెందిన సజ్జత్ అలీ ఖాన్‌ను ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించి పట్టుబడ్డాడు.
Bike Burnt in Nampally : తాగి బైక్ నడిపాడు.. పోలీసులు పట్టుకోగానే తగులబెట్టేశాడు - నాంపల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్
Bike Burnt in Nampally : తాగి వాహనం నడపిన ఓ వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పోలీసులు పట్టుకున్నారు. అతని వాహనాన్ని సీజ్ చేస్తామని చెప్పారు. బైక్‌ను సీజ్ చేస్తామనగానే.. ఆ వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అంతేగాక వాహనాన్ని తగులబెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ నాంపల్లిలో చోటుచేసుకుంది.
Bike Burnt in Nampally
బైక్‌కు నిప్పంటించి..
Bike Burnt in Hyderabad : తన వాహనాన్ని సీజ్ చేస్తాననడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. క్షణికావేశంలో తన ద్విచక్ర వాహనానికి (చేతక్) నిప్పంటించాడు. అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు మంటలను అదుపు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సజ్జత్ అలీ ఖాన్‌పై నాంపల్లి పోలీసులు న్యూసెన్స్ కేస్ నమోదు చేశారు.
- ఇదీ చదవండి :శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత