Madhapur Accident: మద్యం మత్తులో కారు నడిపి.. ప్రమాదానికి కారణమైన ఇద్దరు వైద్యులపై పోలీసులు కేసునమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో మాదాపూర్ ఇనార్బిట్ మాల్ నుంచి అతివేగంగా వచ్చిన కారు.. రోడ్డు దాటుతున్న నలుగురిని బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు మాదాపూర్ ఇనార్బిట్ మాల్ చట్నీస్ హోటల్లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
డాక్టర్లు వినియోగించిన కారు దుర్గం చెరువు సమీపంలో ఓ పబ్‌లో మద్యం తాగిన వైద్యులు నిఖిల్‌రెడ్డి, అఖిల్‌రెడ్డి, తరుణ్.. తమ కారులో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీరు ముగ్గురు వైద్యులుగా గుర్తించారు. వీరికి ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించారు. డ్రైవర్ సీట్లో ఉన్న నిఖిల్‌రెడ్డికి పరీక్ష చేయగా.. ఆల్కహాల్ శాతం 116 శాతం, డ్రైవర్ పక్క సీట్లో కూర్చొన్న అఖిల్రెడ్డికి ఆల్కహాల్ 35 శాతం వచ్చింది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు మాదాపూర్ పోలీసులు చెప్పారు.
Madhapur Accident: మద్యం మత్తులో బీభత్సం.. కారుతో నలుగురిని ఢీకొట్టిన డాక్టర్లు ఇదీచూడండి:Banjara hills accident news: బంజారాహిల్స్ ప్రమాద ఘటనలో రిమాండ్‌కు నిందితులు