తెలంగాణ

telangana

ETV Bharat / crime

మందుబాబు హల్​చల్​.. ఎంత తాగాడో తెలీదు కానీ.. ఇది మామూలు రచ్చ కాదు..! - ఎంత తాగాడో తెలీదు కానీ ఇది మామూలు రచ్చ కాదు

Drunkard hulchal: ఓ యువకుడు ఎంత తాగాడో తెలియదు కానీ.. నానా రచ్చ చేశాడు. మత్తు వదిలించేందుకు పోలీసులు ఏకంగా ఆస్పత్రికే తీసుకొచ్చారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రికి తీసుకొచ్చాకైనా మైకం దిగిందా అంటే.. ఆ మందుబాబు చేసిన హల్​చల్​ అంతా ఇంతా కాదు. కాసేపట్లో ఆస్పత్రి మొత్తం దద్దరిల్లిపోయేలా చేశాడు.. పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు.

Drunkard hulchal in Osmania hospital and scolds police
Drunkard hulchal in Osmania hospital and scolds policeDrunkard hulchal in Osmania hospital and scolds police

By

Published : May 31, 2022, 10:37 PM IST

Drunkard hulchal: హైదరాబాద్​ ఉస్మానియా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో తాగుబోతు హల్​చల్ చేశాడు. మైకంలో ఉన్న యువకుడు ఆస్పత్రిలో కాసేపు.. హంగామా సృష్టించాడు. పోలీసుల అసహనానికి కారణమయ్యాడు. పూటుగా తాగిన ఓ యువకుడు.. జియాగూడలో రోడ్లపై వచ్చీపోయే వాహనాలను అడ్డగిస్తూ ఇబ్బంది కలిగిస్తున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో.. వెంటనే వచ్చిన కుల్సుంపురా పోలీసులు.. ఆ మందుబాబును అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. ఆ తాగుబోతు మాత్రం.. సామాన్యులకు పోలీసులకు తేడా ఏం చూపకుండా.. తనదైన ప్రవర్తనను కొనసాగించాడు. దీనంతటికీ కారణం లోపలున్న మందు మహిమగా గుర్తించిన పోలీసులు.. ముందు ఆ మత్తు వదిలించాలని తలచారు.

అతికష్టం మీద ఆ తాగుబోతును అదుపులోకి తీసుకుని.. నేరుగా ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లి.. మత్తు వదిలించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఆ తాగుబోతు ఉన్న దగ్గర ఉండక.. పోలీసులను ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడాడు. ఎంత నివారించిందుకు ప్రయత్నిస్తే.. అంతకు ఎక్కువ హంగామా చేయటం ప్రారంభించాడు. పక్కనున్నది ఓ ఎస్సై అన్న సోయి కూడా లేకుండా.. నోటికి ఎంతొస్తే అంత తిట్టడం మొదలుపెట్టాడు. అంతేనా బెదిరింపులు కూడా చేశాడు.

సరిగ్గా నిలబడలేకపోతున్నా.. గట్టిగట్టిగా అరుస్తూ.. నోటికొచ్చిన బూతులతో పోలీసులను దూషిస్తూ హల్​చల్​ చేశాడు. ఈ తతంగమంతా.. అక్కడున్న రోగులు, వారి బంధువులకు ఇబ్బందికరంగా మారింది. అతడి చేష్టలు వారిలో భయాందోళనలు కలిగించాయి. ముప్పు తిప్పలు పెడుతున్నా పోలీసులు మాత్రం ఎంతో ఓపికగా మందుబాబును భరించారు. కానీ.. అందరూ అలానే ఉండలేరుగా.. పక్కనే ఉన్న ఎస్సైని ఇష్టానుసారంగా బూతులు తిట్టటంతో ఓ కానిస్టేబుల్​.. ఒకానొక సందర్భంలో సహనం కోల్పోవాల్సి వచ్చింది. తన పైఅధికారిని తన ముందే తిడుతుంటే చూస్తూ ఉండలేక.. కోపంలో చేతికి పనిచెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ.. మాట వినలేదు. అతన్ని నివారించటం పోలీసులకు కష్టతరమైంది. ఇంత జరిగినా.. ఆ మందుబాబు మత్తు దిగకపోవటం గమనార్హం. మొత్తానికి మందుబాబులకే బాబులా ఉన్న ఆ బాబు వివరాలు తెలియరాలేదు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details