తెలంగాణ

telangana

ETV Bharat / crime

Road Accident: జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడి వద్ద కారు బీభత్సం.. - rash driving latest crime news

Road Accident: హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లో ఈరోజు తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. పెద్దమ్మ గుడి వద్ద కారు అతివేగంతో వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. ఎయిర్‌ బెలూన్‌ ఓపెన్‌ కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

కారు
కారు

By

Published : Aug 12, 2022, 12:59 PM IST

Road Accident: హైదరాబాద్​ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ సమీపంలో ప్రధాన రహదారిపై తెల్లవారుజామున కారు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం సేవించి వాహనం నడిపి డివైడర్​ను ఢీకొట్టాడు. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు ముందు భాగం దెబ్బతింది. ఆ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ బానోతు చందును జూబ్లీహిల్స్ పోలీసులు శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించగా ఆల్కహాల్‌ శాతం 111 పాయింట్లు ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details