తెలంగాణ

telangana

ETV Bharat / crime

పీకలదాకా తాగి.. కారుతో సీపీ కార్యాలయం గేటునే ఢీకొట్టారు.. - మద్యం మత్తులో మందుబాబుల ర్యాష్‌ డ్రైవింగ్‌

drunkard hit the CP office gate with rash driving influence in alocohal
drunkard hit the CP office gate with rash driving influence in alocohal

By

Published : Jun 4, 2022, 3:43 PM IST

Updated : Jun 4, 2022, 4:16 PM IST

15:38 June 04

పీకలదాకా తాగి.. కారుతో సీపీ కార్యాలయం గేటునే ఢీకొట్టారు..

హైదరాబాద్​లో మందుబాబులు రెచ్చిపోయారు. పీకలదాకా తాగి.. కారులో రయ్​రయ్​మంటూ షికారు చేశారు. మద్యం మత్తులో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశారు. మత్తులో తేలిపోతున్న మందుబాబు.. కారును కూడా గాల్లో పోనిచ్చాడు.

ఇంకేముంది.. మూసుకుపోతున్న కళ్లకు ముందేముందో కనపడక ఓ గేటును ఢీకొట్టేశాడు. తీరా.. మత్తు నుంచి తేరుకుని కారు దిగి చూస్తే.. ఆ గేటు ఎవరిదో కాదు.. బషీర్​బాగ్​లోని సీపీ కార్యాలయానిది. కారు ఢీకొని సీపీ కార్యాలయం గేటు స్వల్పంగా ధ్వంసమైంది. మందుబాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఇవీ చూడండి:

Last Updated : Jun 4, 2022, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details