MURDER: పైసలివ్వలేదని తండ్రిని కొట్టి చంపిన కుమారుడు - Telangana crime news
10:56 October 16
డబ్బు విషయంలో గొడవ
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ కుమారుడు తండ్రిని కొట్టి చంపాడు. రోమాల సాయిలు (50) స్థానికంగా నివాసముంటున్నాడు. అతని కుమారుడు అనిల్ నిత్యం మద్యం తాగేవాడు.
తరచూ మద్యం తాగుతూ... డబ్బుల కోసం తండ్రిని వేధించే వాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి అనిల్ తాగి ఇంటికి వచ్చి... తండ్రిని డబ్బులు అడిగాడు. లేవని తెలుపడంతో అనిల్ ఆగ్రహానికి లోనయ్యాడు. మత్తులో తండ్రిని కొట్టి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.