మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురు.. హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 14మంది మందిని అదుపులోకి తీసుకుని 9 బైక్లు, 5 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పలువురిపై కేసులు - హైదరాబాద్
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మందుబాబులను అదుపులోకి తీసుకుని.. బైక్లు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదుచేసి.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పలువురిపై కేసులు
పరిమితికి మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తెల్లవారుజాము వరకు ఈ తనిఖీలు కొనసాగాయి.