పోలీసులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపట్టినా.. మందు బాబుల తీరు మారడం లేదు. తాగి రోడ్డెక్కకూడదని ఎంత మొరపెట్టుకున్నా వారు లెక్కచేయడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
తాగి రోడ్డెక్కిన మందుబాబులు.. వాహనాలు సీజ్ చేసిన పోలీసులు
మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కొందరి తీరు మారడం లేదు. రోజురోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
డ్రంక్ అండ్ డ్రైవ్, హైదరాబాద్‌లో మందుబాబులు
శుక్రవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. చెక్‌పోస్ట్ వద్ద చేసిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడిపిన 16 మందిపై కేసు నమోదు చేసి, వారి వాహనాలు జప్తు చేశారు. ఇందులో నాలుగు కార్లు, 12 ద్విచక్రవాహనాలు ఉన్నాయి.
- ఇదీ చదవండి :బెంగళూరులో తీగ లాగితే.. తెలంగాణలో కదిలిన డొంక!