Drugs Seized in Medchal : రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. నిందితుల ఇళ్లలో సోదాలు - medchal district news
14:03 October 23
Drugs Seized in Medchal : మేడ్చల్ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
మేడ్చల్ జిల్లాలో భారీ డ్రగ్ రాకెట్ బయటపడింది. రూ.2 కోట్ల విలువైన మెపిడ్రిన్ డ్రగ్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారినుంచి 4.92 కిలోల మెపిడ్రిన్‌తో పాటు కారును సీజ్ చేశారు. డ్రగ్స్ కేసులో పవన్, మహేశ్ రెడ్డి, రామకృష్ణ గౌడ్‌ను అరెస్ట్ చేయగా ప్రధాన నిందితులు ఎస్.కె.రెడ్డి, హనుమంతరెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులకు ఉన్న పక్కా సమాచారం కూకట్‌పల్లిలో ఉంటున్న పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పవన్ ఇచ్చిన సమాచారంతో మేడ్చల్‌లోని మహేశ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయగా 926 గ్రాముల మెపిడ్రిన్ బయటపడింది. మహేశ్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో నాగర్‌కర్నూల్ వాసి అయిన రామకృష్ణగౌడ్ ఇంట్లో సోదాలు చేయగా తన కారులో 4 కిలోల మెపిడ్రిన్ దొరికిందని తెలిపారు. నిందితులను మీడియా ముందు ఎక్సైజ్ పోలీసులు పరిచారు.
ఇదీ చదవండి:Marijuana smuggling: గంజాయి కట్టడికి అధికారులు సమాయత్తం.. అంతర్రాష్ట్ర సరిహద్దులే కీలకం