Choreographer arrest: మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా డ్రగ్స్ వినియోగం మాత్రం ఆగడం లేదు. తాజాగా నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపికృష్ణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోనిమియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి గోకుల్ ప్లాట్స్‌లో చోటుచేసుకుంది.
Choreographer arrest డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిపోయిన కొరియోగ్రాఫర్ - డ్రగ్స్ తాజా సమాచారం
Choreographer arrest హైదరాబాద్ నగరంలో నిషేధిత డ్రగ్స్ మాత్రలతో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పట్టుబడ్డాడు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితునిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
drugs
దొమ్మరాజు గోపికృష్ణ అనే వ్యక్తి నిషేధిత ఎండీఎంఏ డ్రగ్స్‌ను ఓ వ్యక్తికి విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. గోపికృష్ణ వద్ద నుంచి 55 వేల రూపాయల విలువచేసే పది నిషేధిత డ్రగ్స్ మాత్రలు, ఓ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఎస్వోటీ పోలీసులు కేసు నమోదు చేశారు.