Drugs selling man arrest: కొత్త సంవత్సర వేడుకలే లక్ష్యంగా మాదక ద్రవ్యాలు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని ఆబ్కారీ శాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితుడి నుంచి 25 గ్రాముల కొకైన్, 48 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన సతీష్ బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 10లోని ఓ ప్రైవేట్ వసతిగృహంలో ఉంటూ డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.
న్యూఇయర్ పార్టీలే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయం.. వ్యక్తి అరెస్ట్ - తెలంగాణ తాజా వార్తలు
Drugs selling man arrest: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో డ్రగ్స్ విక్రేత అరెస్టు అయ్యారు. మాద్రకద్రవ్యాలు విక్రయిస్తున్న యువకుడు హరిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 48 గ్రాముల ఎంపీఎంఏ, 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కొత్త ఏడాది వేడుకల్లో విక్రయానికి సిద్ధం చేసినట్లు గుర్తించారు.
యెమన్‌కి చెందిన అబ్దురబు పర్యాటకవీసాపై వచ్చి హైదరాబాద్‌లో నివాసం ఉన్న అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బెంగళూర్‌లో ఉంటున్న అబ్దురబు.. 11 మంది ఏజెంట్లను పెట్టుకొని మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అబ్దురబు సహా అతని అనుచరులపై నిఘాపెట్టారు. అందులో భాగంగా సతీష్ పైనా నిఘా పెట్టారు. అబ్దురబు నుంచి గ్రాముకొకైన్ 10వేలు, గ్రాము ఎండీఎంఏ 5 వేలకు సతీష్ కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
ఇవీ చదవండి :