తెలంగాణ

telangana

ETV Bharat / crime

మత్తు మందు ఇచ్చి వివాహితపై అత్యాచారం.. ఆపై..!

ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని నగరానికి వచ్చిన వివాహితపై ఓ ప్రభుత్వ ఉద్యోగి కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడు. ఆపై నగ్న చిత్రాలు తీసి బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

మత్తు మందు ఇచ్చి వివాహితపై అత్యాచారం.. ఆపై..!
మత్తు మందు ఇచ్చి వివాహితపై అత్యాచారం.. ఆపై..!

By

Published : Jul 25, 2022, 1:30 PM IST

మత్తు మందు ఇచ్చి వివాహితపై ప్రభుత్వ ఉద్యోగి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా భయపెట్టడానికి ఆమె నగ్న చిత్రాలను తీశాడు. ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని ఆమెను బెదిరించాడు. ఈ విషయం ఆదివారం శంషాబాద్‌లో వెలుగుచూసింది. ఆర్జీఐఏ పోలీసుల కథనం ప్రకారం.. ముడావత్‌ చందులాల్‌(40) శంషాబాద్‌ ఉప కేంద్రంలో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త చనిపోవడంతో ఓ మహిళ(26) ఉపాధి కోసం శంషాబాద్‌కు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఈ క్రమంలోనే ఆమెపై కన్నేసిన చందులాల్‌.. కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో మత్తు మందు చేతి రుమాలులో పెట్టుకొని ఆమె ఇంటికి వెళ్లాడు. తలుపు తీయగానే ఆ రుమాలును ఆమె ముక్కుపై పెట్టాడు. స్పృహ కోల్పోయిన మహిళపై అత్యాచారం చేసి ఆమె నగ్న చిత్రాలను చరవాణిలో రికార్డు చేసుకొని పరారయ్యాడు. అనంతరం మహిళ నగ్న చిత్రాలను ఆమె చరవాణికి పంపించి బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details