తెలంగాణ

telangana

ETV Bharat / crime

Drugs seized: మాదకద్రవ్యాల పట్టివేత.. మహిళ సహా ముగ్గురు అరెస్ట్ - తెలంగాణ వార్తలు

Drug confiscation in Banjara Hills, Hyderabad
బంజారాహిల్స్‌లో మాదకద్రవ్యాల పట్టివేత

By

Published : Sep 4, 2021, 12:44 PM IST

Updated : Sep 4, 2021, 6:34 PM IST

12:42 September 04

బంజారాహిల్స్‌లో మాదకద్రవ్యాల పట్టివేత

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు(Drugs seized). ఒక మహిళ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ(MDMA), 10 కిలోల గంజాయి(Marijuana), 50 గ్రాముల ఛారాస్‌, 4  బోల్ట్స్‌ ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ను(LSD Drugs) స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో హైదరాబాద్‌కు చెందిన శివశంకర్ రెడ్డి, మణికంఠ, డార్జిలింగ్‌కు చెందిన శిల్పా రాయ్‌లు ఉన్నారు.

మత్తు గుట్టు రట్టు

అరెస్టయిన వారి నుంచి 2 మోటారు సైకిళ్లు, 4 మొబైల్‌ ఫోన్లు, ఒక డిజిటల్ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సత్యనారాయణ అనే వ్యక్తి గోవాలో మకాం వేసి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లుగా ఎన్‌ఫోర్స్‌మంట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే గంజాయిని గోవాకు తెప్పించుకోవడం... గోవా నుంచి హైదరాబాద్‌కు వివిధ రకాల మాదకద్రవ్యాలను  చేరవేయడంలో శిల్పారాయ్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. గోవా నుంచి వచ్చే మాదక ద్రవ్యాలను హైదరాబాద్‌లో అవసరమైన వారికి విక్రయించేందుకు మణికంఠ, శివశంకర్ రెడ్డిలు సత్యనారాయణకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు.  

ముమ్మర దర్యాప్తు

ఎల్‌ఎస్‌డీ ఒక బ్లాట్ విక్రయానికి రూ.500, ఎండీఎంఏ గ్రాము అమ్మకానికి రూ.1000 చొప్పున మణికంఠ, శివశంకర్ రెడ్డిలు కమీషన్ తీసుకుంటారని పేర్కొన్నారు. రెండున్నర నెలలుగా ఈ మత్తుపదార్థాల ముఠా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ల ద్వారా మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఎవరితో విక్రయాలు జరుపుతున్నారు?...ఎంత మోతాదులో అమ్ముతున్నారు? ఇప్పటి ఈ ముఠా ఎంత మొత్తంలో మాదక ద్రవ్యాల విక్రయం చేసింది? తదితర అంశాలపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ అంజిరెడ్డి నేతృత్వంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ప్రేమ పేరుతో వంచన.. సీఎం కాన్వాయ్ డ్రైవర్‌పై హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు

Last Updated : Sep 4, 2021, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details