జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ ఆటోను ఢీకొన్న ఘటనలో డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయాడు. దాదాపు అరగంటపాటు నరకయాతన అనుభవించాడు. జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, జగిత్యాల వైపు వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటో ముందుభాగం నుజ్జు నుజ్జయింది. డ్రైవర్ అందులోనే ఇరుక్కున్నాడు.
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ నరకయాతన
వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు టాటా ఏస్ ఆటోను ఢీకొట్టింది. ప్రమదంలో ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఆటో డ్రైవర్ అందులోనే ఇరుక్కుని నరకయాతన అనుభవించాడు. స్థానికులు అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించగా.. రాక పోగా క్రేన్ సాయంతో బయటకు తీశారు.
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ నరకయాతన
స్థానికులు అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయినా వీలుకాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆర్టీసీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. బస్సులో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు.
ఇదీ చూడండి :గుడిలో పురుగుల మందు తాగి సూసైడ్