Driver rapes woman: ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కిన తనపై డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. హైదరాబాద్లోని కూకట్‌పల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని సొంత గ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 23న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కినట్లు తెలిపింది. బస్సులో లగేజీ మాత్రమే తరలించి.. రైలు ఎక్కాల్సి ఉన్నా బస్సులో సీటు కేటాయిస్తామని డ్రైవర్ రాజేష్ ఇచ్చిన హామీతో బస్సు ఎక్కినట్లు పేర్కొంది.
3 వేలు తీసుకుని చివరి స్లీపర్ బెర్త్ ..
3 వేలు తీసుకుని చివరి స్లీపర్ బెర్త్ కేటాయించిన డ్రైవర్.....అర్థరాత్రి ఆమె వద్దకు వెళ్లి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. బస్సు దిగే సమయంలో దొంగతనం నెపంతో 7 వేల రూపాయలు లాక్కున్నట్లు ఆరోపించింది. నిందితుడు రాజేష్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది.