Driver Misbehaves with Students : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డిలో ఓ యువకుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భయంతో పరుగులు తీసిన విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. స్థానికులతో కలిసి వారి తల్లిదండ్రులు యువకుణ్ని చితకబాదారు.
విద్యార్థినులతో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. చితకబాదిన తల్లిదండ్రులు - కామారెడ్డిలో విద్యార్థులతో డ్రైవర్ అసభ్య ప్రవర్తన
Driver Misbehaves with Students: స్కూల్ టీచర్‌ను దిగబెట్టడానికి వచ్చిన ఓ కారు డ్రైవర్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. భయపడిన పిల్లలు తల్లిదండ్రులకు చెప్పగా.. స్థానికుల సాయంతో వారు ఆ డ్రైవర్‌ను చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో చోటుచేసుకుంది.

Driver Misbehaves with Students in Kamareddy: పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయురాలి కారు డ్రైవర్ కిషన్.. రోజూలాగే ఇవాళ కూడా ఆమెను స్కూల్‌లో దిగబెట్టాడు. అక్కణ్నుంచి ఇంటికి వెళ్లకుండా.. పాఠశాల వద్దే ఉండి.. విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న కిషన్.. విద్యార్థినులను ముట్టుకుంటూ వింతగా ప్రవర్తించడంతో వారు భయపడి తల్లిదండ్రులకు చెప్పారు. స్థానికులు, విద్యార్థినుల తల్లిదండ్రులు డ్రైవర్‌ను చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు.