తెలంగాణ

telangana

ETV Bharat / crime

44 మంది ప్రయాణీకులను కాపాడి... ప్రాణాలు విడిచిన బస్​ డ్రైవర్​ - తెలంగాణ వార్తలు

Jagtial RTC BUS Accident : బస్సు డ్రైవింగ్​ సీట్​లో కూర్చోవడం అంటే వాహనం నడపడమే కాదు... ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఎవ్వరికీ ఏమీ కాకుండా తన ప్రాణాలు పణంగా పెట్టడం అంటారు. ఈ సిద్దాంతాన్ని నమ్మిన ఆ చోదకుడు తన ప్రాణం అడ్డుపెట్టి 44 మంది ప్రయాణీకుల ప్రాణాలు కాపాడాడు. ఊహించని ప్రమాదంలో అందిరి ఆయువును కాపాడి.. తుదిశ్వాస విడిచాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్​ మండలంలో జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్​ మృతి చెందాడు.

BUS ACCIDENT
BUS ACCIDENT

By

Published : Jan 8, 2022, 4:21 PM IST

Jagtial RTC BUS Accident : జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు టైరు పేలి రోడ్డు పక్కన మురికి కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోగా.... 44మంది ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. జగిత్యాల నుంచి నిర్మల్‌ వెళ్తున్న బస్సు మల్కాపూర్‌ సమీపంలోకి చేరుకోగానే ముందు టైరు పేలిపోయింది. బస్సును నియంత్రించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన డ్రైవర్‌.... తలుపు తెరుచుకుపోవడం వల్ల కాల్వలో పడి తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు

ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి తమ ప్రాణాలు కాపాడి.... తన ప్రాణాలు కోల్పోయాడని ప్రయాణికులు భావోద్వేగానికి లోనయ్యారు.

ఇదీ చూడండి:రోడ్డు ప్రమాదంలో అన్న మృతి.. చూసేందుకు వెళ్తున్న తమ్ముడు కూడా!

ABOUT THE AUTHOR

...view details