కదులుతున్న బస్సులోనే ప్రయాణికురాలిపై అత్యాచారానికి ఒడిగట్టిన కేసులోని నిందితుడు డ్రైవర్‌ను కూకట్‌పల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అమీర్‌పేట పరిధిలోని ఓ ప్రయాణికురాలు(29) ఫిబ్రవరి 23న భీమవరం వెళ్లడానికి ప్రైవేటు స్లీపర్‌కోచ్ బస్సెకింది. అర్ధరాత్రి దాటాక దారి మధ్యలో మరో డ్రైవర్ బస్సు నడుపుతున్నాడు సదరు బస్సు డ్రైవర్ ఆమెపై అత్యాచారం చేశాడు.
ఉదయం బస్సు దిగే సమయంలో బాధితురాలి పర్సును సైతం లాక్కుని రూ.7 వేలు తీసుకున్నాడు. బాధితురాలు ఫిబ్రవరి 26న నగరానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజేశ్‌ను సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడిది కృష్ణాజిల్లా నక్కవారిపాలేమని పోలీసులు తెలిపారు. ‘వేమూరి కావేరి ట్రావెల్స్’ బస్సును సీజ్ చేశారు.