ఆర్టీసీ డిపోలో పురుగులమందు తాగి డ్రైవర్ ఆత్మహత్య - డిపోలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
12:09 June 29
రాణిగంజ్ ఆర్టీసీ డిపో1లో డ్రైవర్ ఆత్మహత్య
సికింద్రాబాద్ రాణిగంజ్ ఆర్టీసీ డిపో1లో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాణిగంజ్‌లో విధులు నిర్వహిస్తున్న తిరుపతి రెడ్డికి అధికారులు కొన్ని రోజులుగా విధులు కేటాయించట్లేదు. ఈ విషయమై బాధితుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే అధికారులు వేధిస్తున్నారంటూ... తిరుపతిరెడ్డి డిపోలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అప్రమత్తమైన సహచరులు ఆస్పత్రికి తరలిస్తుండగానే దారిలో తిరుపతి రెడ్డి మృతి చెందాడు. నెలరోజుల నుంచి అధికారులు డ్యూటీ ఇవ్వకుండా వేధిస్తున్నారని సహద్యోగులు ఆరోపించారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ఆర్టీసీ డ్రైవర్లు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు.
ఇదీ చూడండి: మెదక్:శివ్వంపేట తహశీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు