తెలంగాణ

telangana

ETV Bharat / crime

drinkers fighting: నడి రోడ్డుపై తాగుబోతుల వీరంగం.. ఎక్కడంటే - కామారెడ్డి జిల్లా తాజా నేర వార్తలు

drinkers fighting: సమాజంలో రోజురోజుకు మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఆ మైకంలో వారు చేస్తున్న చేష్టలు ప్రజలకు ఇబ్బందిగా మారాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో నడిరోడ్డు పైనే ఒకరినొకరు తలలు పగిలేలా కొట్టుకున్నారు.

drinkers fighting on road
కామారెడ్డి జిల్లాలో రోడ్డు పైన మందుబాబుల వీరంగం

By

Published : Feb 10, 2022, 12:22 PM IST

drinkers fighting:కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో గల 3వ నెంబర్ కల్లు దుకాణం వద్ద ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. కల్లు దుకాణం మందుబాబులకు అడ్డాగా మారింది. మంగళవారం కొంత మంది తాగిన మైకంలో ఒకరినొకరు తలలు పగిలేలా సీసాలు, కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకున్నారు.

కల్లు దుకాణం ఉండడం వల్లే రోజు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. జన నివాసాల మధ్య ఉన్న ఈ కల్లు దుకాణాన్ని తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి

ABOUT THE AUTHOR

...view details