తెలంగాణ

telangana

ETV Bharat / crime

వార్తల్లోకెక్కిన "పుల్లారెడ్డి స్వీట్స్​" కుటుంబం.. మనువడిపై గృహహింస కేసు..

స్వచ్ఛమైన నేతి మిఠాయిలకు కేరాఫ్​ అడ్రస్​గా పుల్లారెడ్డి స్వీట్స్​ ప్రఖ్యాతిగాంచగా.. దాని యజమాని పుల్లారెడ్డి కుటుంబం వార్తల్లోకెక్కింది. పుల్లారెడ్డి మనువడైన ఏక్​నాథ్​రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఏక్​నాథ్​రెడ్డిపై ఫిర్యాదు చేసింది అతడి భార్యే కావటం చర్చనీయాంశమైంది.

dowry and Domestic violence cases on eknath reddy who was grand son of pulla reddy
dowry and Domestic violence cases on eknath reddy who was grand son of pulla reddy

By

Published : May 14, 2022, 3:30 PM IST

Updated : May 15, 2022, 10:57 AM IST

అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్న భర్త, అత్తమామలు కోడలిపై ఆగ్రహంతో ఆమె గది నుంచి బయటకు వచ్చే దారిని మూసేస్తూ రాత్రికి రాత్రే గోడకట్టారు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసు ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన కె.ప్రజ్ఞారెడ్డికి 2014 మార్చి 19న హైదరాబాద్‌కు చెందిన పుల్లారెడ్డి స్వీట్స్‌ వ్యవస్థాపకుడు జి.పుల్లారెడ్డి మనుమడు ఏకనాథ్‌రెడ్డి(కుమారుడు రాఘవరెడ్డి, కోడలు భారతిరెడ్డిల కుమారుడు)తో వివాహమైంది. వారు అత్తమామలతో కలిసి బేగంపేటలో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా ఏకనాథ్‌రెడ్డి రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో భర్త, అత్తమామలు ప్రజ్ఞారెడ్డి కుటుంబం నుంచి మరింత డబ్బు వసూలు చేసే ప్రయత్నంలో భాగంగా వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేయమని ఒత్తిడి చేశారు.

దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను వారు వేధించడం మొదలుపెట్టారు. వీరి విడాకులకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 10న ప్రజ్ఞారెడ్డి నిద్రిస్తుండగా భర్త, అత్తమామలు ఆమె ముఖంపై దిండుతో నొక్కి హత్యాయత్నం చేశారు. తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అలా చేస్తే కుమార్తెను, బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులను చంపేస్తామని వారు ఆమెను బెదిరించారు. ఆపై ఆమె ఉండే గదులకు విద్యుత్తు, నీటి సరఫరా నిలిపివేశారు. ఈ నెల 12న మొదటి అంతస్తు నుంచి కిందకు చేరుకునే మెట్ల దారిని మూసేస్తూ రాత్రికి రాత్రే గోడ కట్టారు. భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. ఆమె వేకువజామున నిద్రలేచి చూడగా మెట్ల దారిలో గోడ ఉండటాన్ని చూసి పోలీసులకు ఫోన్‌ చేసి తెలియజేశారు. పోలీసుల సహాయంతో ఆమె బయటపడ్డారు. ఈ ఘటనపై ఈ నెల 13న రాత్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భర్త ఏకనాథ్‌రెడ్డి, అత్తమామలు భారతిరెడ్డి, రాఘవరెడ్డి, ఆడపడుచు శ్రీవిద్యారెడ్డిలపై పోలీసులు వరకట్న వేధింపులు, గృహహింస చట్టం కింద కేసులు నమోదు చేశారు. తనకు ప్రాణాపాయం ఉందని రక్షణ కల్పించాలని బాధితురాలు పోలీసులను కోరారు.

ఇవీ చూడండి:

Last Updated : May 15, 2022, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details