తెలంగాణ

telangana

ETV Bharat / crime

తెలంగాణలో 9,479 గృహహింస కేసులు పెండింగ్‌

Domestic violence cases pending in telangana ఇంట్లో వివాహిత మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అకృత్యాల దృష్ట్యా 2005లో గృహహింస నిరోధక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోని వచ్చింది. అప్పటి నుంచి నేటివరకు దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఇంకా ఎన్ని కేసులు పెండింగ్​లో ఉన్నాయనే వాటిపై జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ వివరాలు సమర్పించింది.

Telangana
తెలంగాణ

By

Published : Sep 2, 2022, 11:38 AM IST

Domestic violence cases pending in telangana: తెలంగాణలో 9,479, ఆంధ్రప్రదేశ్‌లో 7,053 గృహహింస కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ తరుఫు న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపారు. గృహ హింస కేసులపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ‘వియ్‌ ద ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో దాఖలుచేసిన అఫిడవిట్‌లో ఈ మేరకు పేర్కొన్నారు.

గృహహింస చట్టం-2005 అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి తెలంగాణలో 30,299 కేసులు దాఖలుకాగా, అందులో 20,820 విచారణ పూర్తయిందని, 9,479 పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. 2,044 కేసుల్లో అప్పీళ్లు దాఖలుకాగా, అందులో 1,597 విచారణ ముగిసిందని, 447 కేసులు ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.

ఏపీవ్యాప్తంగా 23,124 కేసులు నమోదుకాగా, అందులో 16,071 కేసుల విచారణ ముగిసింది. ఇంకో 7,053 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మరో 2,857 కేసుల్లో అప్పీళ్లు, రివిజన్‌ పిటిషన్లు దాఖలు అయ్యాయి. అందులో 2,524 పిటిషన్ల విచారణ ముగిసిందని, ఇంకా 333 పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 4,71,684 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details