వరంగల్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం(accident) చోటుచేసుకుంది. హన్మకొండ నుంచి వరంగల్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో మరిపెడకు చెందిన వైద్యుడు విజయ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.
Accident: అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. వైద్యుడు మృతి
వరంగల్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డాక్టర్ అక్కడికక్కడే మృతి చెందారు. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. గతంలో రెమ్‌డెసివిర్(remdesivir) ఇంజక్షన్ అధిక ధరకు అమ్ముతూ పట్టుబడిన ముఠాలో మృతుడు కూడా ఉన్నాడు.
వరంగల్‌లో రోడ్డు ప్రమాదం
వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలంలో కొన్ని రోజుల క్రితం కరోనా(corona) వ్యాధితో బాధపడుతున్న రోగికి రెమ్‌డెసివిర్(remdesivir) ఇంజక్షన్ అధిక ధరకు అమ్ముతూ పట్టుబడిన ముఠాలో విజయ్ కుమార్ ఒకరు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:'మున్సిపల్ సిబ్బంది.. డబ్బులివ్వమని వేధిస్తున్నారు'