హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ కూడలి వద్ద ఔటర్ రింగు రోడ్డుపై శనివారం రాత్రి కారు దగ్ధమై(doctor burnt alive in car)న ఘటనలో మృతి చెందిన వ్యక్తిని డా.నేలపాటి సుధీర్(39)గా గుర్తించారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పొన్నలూరు మండల కేంద్రంలోని శివాజీనగర్. కొన్నేళ్లుగా కేపీహెచ్‌బీ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య సుప్రజ, తొమ్మిది సంవత్సరాల కుమారుడు ఉన్నారు.
డాక్టర్ సుధీర్.. నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడిగా సేవలందించేవారు. కొంత కాలం నుంచి ఆయన వైద్య వృత్తిని వదిలి మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. శనివారం ఆయన బయటకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి కారులో ఒంటరిగా బయలుదేరారు. నానక్‌రామ్‌గూడ కూడలి వద్ద బాహ్యవలయ రహదారిపైకి ఎక్కారు. శంషాబాద్, హమీదుల్లానగర్ 135 కి.మీ వద్దకు రాగానే కారులో మంటలు(doctor burnt alive in car) చెలరేగాయి. ఈ ఘటనలో ఆ వైద్యుడు సజీవ దహనమయ్యారు(doctor burnt alive in car). షార్ట్‌సర్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.