తెలంగాణ

telangana

ETV Bharat / crime

acb raids: రూ.2 లక్షలు తీసుకుంటూ అనిశాకు చిక్కిన జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖాధికారి - mahabubabad sc welfare officer caught by acb

acb raids on mahabubnagar scheduled cast officer
acb raids on mahabubnagar scheduled cast officer

By

Published : Aug 16, 2021, 6:40 PM IST

Updated : Aug 16, 2021, 11:05 PM IST

18:37 August 16

రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి

ఓ హాస్టల్ వార్డెన్ నుంచి రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి, వాచ్​మెన్​లు అనిశా అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.  

హాస్టల్ వార్డెన్ బాలరాజు 2019 సంవత్సరంలో మహబూబాబాద్ పట్టణంలోని ఓ హాస్టల్​లో పనిచేస్తున్న సమయంలో సస్పెండ్ అయ్యాడు. 2021లో మళ్లీ.. మరిపెడ మండల కేంద్రంలోని ఓ హాస్టల్ వార్డెన్​గా విధుల్లో చేరాడు. సస్పెండ్ అయిన కాలానికి 7 లక్షల 20 వేల రూపాయలు సప్లమెంటరీ బిల్లులు మంజూరు అయ్యాయి. ఈ బిల్లులు వచ్చాక రెండు లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని జిల్లా అధికారి షెడ్యూల్​ రాజు డిమాండ్ చేశాడు. దీనిపై బాలరాజు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.  

సోమవారం.. రూ.2 లక్షలు తీసుకొని జిల్లా షెడ్యూల్​ కులాల అధికారి ఇంటికి బాలరాజు వెళ్లాడు. ఇంటి పక్కనే ఉంటున్న వాచ్​మెన్​ గురుచరణ్​కు ఆ నగదు అందించాలని..సదరు అధికారి చెప్పాడు. ఆ డబ్బు ఇస్తుండగా.. అక్కడే మాటు వేసి ఉన్న అనిశా అధికారులు.. షెడ్యూల్​ కులాల అధికారి, వాచ్​మెన్​ గురుచరణ్​లను అదుపులోకి తీసుకున్నారు.  

ఇద్దరిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నామని.. కెమికల్ టెస్ట్​లో రిపోర్ట్ పాజిటివ్​గా వచ్చిందని ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ చెప్పారు. ఎవరైనా అధికారులు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తే 1064కు కాల్ చేయాలని సూచించారు. గతంలో తామిద్దరం సన్నిహితంగా మెలిగామని.. అయినా లంచం డిమాండ్​ చేయడంతోనే అనిశా అధికారులను ఆశ్రయించినట్లు బాధితులు బాలరాజు తెలిపారు. 

ఇదీచూడండి:గాంధీ ఆస్పత్రిలో దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం!

Last Updated : Aug 16, 2021, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details