దురంతో ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల కలకలం.. స్నేహితుల మధ్య గొడవే కారణం.. - Firing in Train
20:46 July 14
మంచిర్యాల వద్ద ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం
Firing in Train: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ (దురంతో ఎక్స్‌ప్రెస్) వెళ్తున్న రైలులో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ఆర్మీ జవాన్ల మధ్య తలెత్తిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. సికింద్రాబాద్ నుంచి దిల్లీకి.. ఆర్మీ జవాన్లు విశాల్, బలజీత్ సింగ్.. బోగి నెంబర్ బీ-4లో వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దర మధ్యలో గొడవ జరిగింది. మంచిర్యాల- బెల్లంపల్లి రైల్వేస్టేషన్ల మధ్యలో ఘర్షణ తీవ్రస్థాయికి చేరడంతో.. బలజీత్ సింగ్(భారతీయ తల్ సేనలో లాన్స్ నాయక్).. తన వద్ద ఉన్న రివాల్వర్‌ను తీశాడు. వెంటనే ఆ తుపాకీని విశాల్ లాక్కుని కిందకు ఒక రౌండ్ పేల్చాడు.
తుపాకీ శబ్దం విని భయాందోళనకు గురైన ప్రయాణికులు.. టీసీ రాజశేజర్కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని బెల్లంపల్లి పోలీసులకు టీసీ తెలిపాడు. రైలు సికింద్రాబాద్ తర్వాత బళ్లార్ష స్టేషన్లో మాత్రమే హల్ట్ ఉండగా.. కాల్పుల ఘటనతో కాగజ్‌నగర్ స్టేషన్లో నిలిపివేశారు. ఇద్దరు జవాన్లను రైల్వేపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ మద్యం మత్తులో ఉండటంతో.. పోలీసుల విచారణకు సహకరించలేదు. వారిద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించనున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి: