Disha App That Saved a woman: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి మండలం ఓ రిసార్ట్లో ముగ్గురు వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఆ మహిళ వెంటనే దిశ యాప్‌లో సమాచారం అందించటంతో, కావలి పోలీసులు స్పందించారు. సకాలంలో అక్కడకు చేరుకొని మహిళను రక్షించారు. అత్యాచారం చేయబోయిన ప్రసాద్, వెంకటేశ్వర్లు, శంకరయ్యను అరెస్టు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.