Sexual Harassment in Private Hospital: మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలంటారు. అలా వారు ఎదో ఒక పని చేస్తూ తాము ఎవరికీ తక్కువ కాదని నిరూపించుకుందామంటే.. వారి అడుగలకు అడ్డుగా నిలుస్తూ వేధిస్తున్నారు కొందరు కామాంధులు. తాజాగా ఓ వ్యక్తి మేడ్చల్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ.. అందులో పనిచేసే మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాలలోకి వెళితే.. మేడ్చల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్వప్న అనే మహిళ మేనేజర్‌గా పని చేస్తుంది. రోజు విధులకు హాజరవుతూ తన పనిని సక్రమంగా నిర్వహిస్తుంది. కానీ అదే ఆసుపత్రి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రవి.. ఆమె పట్ల ఆసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. రోజురోజుకి ఆ కామాంధుడి ఆగడాలు మితిమీరడంతో ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. దాంతో ఇవాళ ఆసుపత్రికి వచ్చిన డైరెక్టర్ రవిని తన బంధువులతో కలిసి నిలదీసిన బాధిత మహిళా ఉద్యోగి ఆందోళనకు దిగారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ ప్రబుద్ధుడి భార్య అదే ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో స్వప్న తనను ఎందుకు వేధిస్తున్నావని రవిని నిలదీయగా అతని భార్య మధ్యలో తలదూర్చడంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. తప్పంతా బాధితురాలిదే అంటూ.. ఆమెపై దాడికి పాల్పడింది.