రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపైన.. ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరముందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. నేరాల నిరోధానికి.. డిజిటల్ లిటరసీ టూ సెక్యూర్ యూత్ (దిల్ సే ) పేరిట ఓ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు.
సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంతో కళాశాలలు, పాఠశాలల విధ్యార్థులకు.. సైబర్ భద్రతపై అవగాహన కల్పించనున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు. ఐటీ కంపెనీల్లో పనిచేసే 100మంది సైబర్ నిపుణులు ఇందులో భాగమవుతారని వివరించారు.