తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఎస్​వోటీ దాడులు.. డీజిల్​ చోరీ ముఠా అరెస్ట్ - sot rides on diesel chory gang

డీజిల్​ చోరీకి పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్​ఓటీ పోలీసులు అరెస్ట్​ చేశారు. పక్కా పథకంతోనే దొంగతనానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. మూడు నెలలుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

diesel chory
ఎస్​వోటీ దాడులు.. డీజిల్​ చోరీ ముఠా అరెస్ట్

By

Published : Mar 13, 2021, 9:47 PM IST

డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్న 9 మందిని రాచకొండ కమిషనరేట్​ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు ట్యాంకర్లు, 805 లీటర్ల డీజిల్, ద్విచక్ర వాహనం, 9 చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు. ఆదిబట్ల ఠాణా పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో డీజిల్ చోరీకి పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు.

చర్లపల్లికి చెందిన సాయి రఘు గతంలో స్థిరాస్తి వ్యాపారం చేశాడు. ఆశించిన లాభాలు లేకపోవడం వల్ల.. రమేశ్ అనే వ్యక్తి వద్ద సహాయకుడిగా చేరాడు. డీజిల్ ట్యాంకర్ల నుంచి డీజిల్ చోరీ చేస్తూ రమేశ్ బాగా డబ్బులు సంపాదిస్తుండేవాడు. సాయి రఘు సైతం ఇదే వృత్తిని ఎంచుకున్నాడు.

చర్లపల్లిలోని ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ బంకులకు డీజిల్ తీసుకెళ్లే ట్యాంకర్ల డ్రైవర్లతో సాయి రఘు పరిచయం పెంచుకున్నాడు. పెట్రోల్ బంకు యజమానులు... ట్యాంకర్లకు జీపీఎస్ ఏర్పాటుచేయడం వల్ల ఆయా వాహనాలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం డ్రైవర్లకు ఇబ్బందిగా మారింది. పెట్రోల్ బంకులకు వెళ్లే మధ్యలోనే డ్రైవర్లు ఎవరికీ అనుమానం రాకుండా వాహనం నిలిపేవారు.

పెద్ద క్యాన్లలో 250 లీటర్ల వరకు డీజిల్ తీసి వాటిని సాయి రఘుకు.. ట్యాంకర్ల డైవర్లు అప్పగించేవారు. ఆ డీజిల్​ను.. తక్కువ ధరకే ఇతర వాహనదారులకు విక్రయిస్తు సాయి రఘు సొమ్ము చేసుకున్నాడు. మూడు నెలలుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇవీచూడండి:శంషాబాద్​లో సుమారు కిలో బంగారం సీజ్​

ABOUT THE AUTHOR

...view details