two kids died in a family : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యం బారినపడి వారం వ్యవధిలోనే ఇద్దరు కుమారులు మృతి చెందారు. రోజుల వ్యవధిలోనే కంటిపాపలు కనుమరుగవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పావురాల లీలాప్రసాద్, మాధవి దంపతుల పెద్ద కుమారుడు కార్తీక్(8) ఈ నెల 6న, చిన్న కుమారుడు ఆదిరామ్(6) 11న మృత్యువాతపడ్డారు. గ్రామస్థుల కథనం ప్రకారం..
ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లల మృతి.. కారణమేంటో తెలీక గుండెకోత..! - khammam district latest news
కంటికిరెప్పలా కాపాడుకుంటున్న పిల్లలను తీవ్ర అనారోగ్యం చుట్టుముట్టింది. ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు ఆవేదనలోకి కూరుకుపోయారు. ఇంతలోనే ఒక కుమారుడు ప్రాణాలొదిలాడు. ఇంకో కుమారుడినైనా బతికించుకుందాం అనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. అతడు కూడా మరణించడంతో ఆ కుటుంబం పీకలోతు బాధల్లో మునిగిపోయింది. ఇద్దరు చిన్నారులు మరణించినా దానికి కారణం తెలియకపోవడం మరింత దురదృష్టకరం.
వారంలో ఒకే ఇంట్లో ఇద్దరు చిన్నారుల కన్నుమూత.. కారణమేంటో తెలీదు..!
గత వారం చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కార్తీక్ ఇంటి వద్దే మృతి చెందగా.. వడదెబ్బ తగిలిందని కుటుంబసభ్యులు, గ్రామస్థులు భావించారు. ఆదిరామ్ పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతికి కారణాలు తెలియరాలేదు. ఆదిరామ్ శరీర భాగాన్ని పరీక్షల కోసం కేరళ పంపినట్లు వైద్యులు తెలిపారని గ్రామస్థులు చెప్పారు.