Diamonds theft in Banjara Hills: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కోటి రుపాయలు విలువచేసే వజ్రాలు చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బంగారు ఆభరణాల వ్యాపారం చేసే పవన్‌కుమార్ డైమండ్ నెక్లెస్ ఆర్డర్ నిమిత్తం గుజరాత్‌లోని సూరత్ నుంచి వజ్రాలు, బంగారం ముడిసరుకు తెప్పించారు. మంగళవారం రోజున తన షాప్‌లోని లాకర్‌లో వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు.
రూ. కోటి విలువ చేసే వజ్రాలు చోరి.. ఎక్కడంటే..!! - Diamond theft
Diamonds theft in Banjara Hills: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కోటి రూపాయలు విలువ చేసే వజ్రాలు, బంగారం ముడి సరుకు చోరికి గురైంది. బంగారు ఆభరణాలు తయారుచేసే పవన్‌కుమార్ మంగళవారం గుజరాత్ నుంచి వజ్రాలు, బంగారం ముడి సరుకు తీసుకొచ్చి షాపులో భద్రపరచగా.. బుధవారం వచ్చి చూసేసరికి లాకర్‌తో సహా వజ్రాలు చోరికి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Diamond theft in Banjara Hills
బుధవారం ఉదయం వెళ్లి దుకాణాన్ని తెరవగా లాకర్‌తో సహా వజ్రాలు చోరీకి గురైనట్లు గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన వజ్రాల విలువ కోటి రూపాయలు ఉంటుందని పవన్ కుమార్ అంటున్నారు.
ఇవీ చదవండి: