Cyber Crimes With Telugu Youth : సైబర్‌క్రైమ్ అనగానే గుర్తొచ్చేవి ఉత్తరాది ముఠాలు. తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న సైబర్ నేరాలకు మూలాలు ఉత్తరాదిలో కనిపిస్తుంటాయి. భరత్‌పూర్.. జామ్‌తారా.. దేవ్‌ఘర్.. దిల్లీ ముఠాల వంటివే తెలుగు రాష్ట్రాలపై పంజా విసురుతుంటాయి. ఇప్పటివరకు ఇదే జరిగింది. కానీ ఈ ముఠాలు కొత్త పన్నాగాలకు తెర తీశాయి. తెలుగు యువకులనే ఎంపిక చేసుకోవడం మొదలెట్టాయి. సంపాదన కోసం ఎదురుచూస్తున్న యువకులకు గాలమేసి దారికి తెచ్చుకుంటున్నాయి. భారీ మొత్తంలో కమీషన్ల ఆశచూపి సైబర్ నేరాలకు వినియోగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం రాచకొండ పోలీసులకు చిక్కిన ధన్‌బాద్ ముఠాను విచారించడంతో ఇలాంటి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తెలుగు, హిందీ తెలియడంతో..
Dhanbad Gang Cyber Crimes : ఝార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌కు చెందిన విక్రం ఠాకూర్ తెలుగు యువకులపై వలేశాడు. తెలుగు, హిందీ వచ్చిన వారిపై గురి పెట్టాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మకాం వేసి వనపర్తి జిల్లా పెద్దమందడికి చెందిన ఆటో డ్రైవర్ రాజుతో పరిచయం పెంచుకున్నాడు. తొలుత కాల్‌సెంటర్‌లో పనిచేసేందుకు యువకులు కావాలని చెప్పి.. తర్వాత అసలు విషయం బయటపెట్టాడు. సైబర్ నేరాల ద్వారా జనాల్ని మోసగించి రాబట్టిన సొమ్ములో ఏకంగా 30శాతం ఇస్తామని చెప్పడంతో రాజు తన గ్రామానికే చెందిన మరో ఎనిమిది మంది యువకుల్ని(19-21 ఏళ్లు) ధన్‌బాద్ తీసుకెళ్లాడు. వారికి తెలుగుతోపాటు హిందీ కూడా వచ్చు. హైదరాబాద్‌లో చదువు లేదా ఉద్యోగం చేస్తున్నామని ఇళ్లలో చెప్పి రావాలని సూచించాడు. సైబర్ మోసాల్లో శిక్షణ ఇప్పించాడు. ఏడాదికాలంగా అక్కడి కాల్‌సెంటర్ ద్వారా మోసాలు చేయించాడు. ధన్‌బాద్‌లో వారి ఆహార్యం, కదలికలపై అనుమానమొచ్చిన స్థానికులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నిర్వాకం బహిర్గతం కావడంతో రాచకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం పీటీ వారెంట్‌పై వారిని ఇక్కడికి తీసుకొచ్చారు.
‘పట్నా’ మరణాలపై అనుమానాలు