తెలంగాణ

telangana

ETV Bharat / crime

'మైనర్ బాలిక లైంగిక దాడి కేసును పర్యవేక్షించండి' - డీజీపీ మహేందర్ రెడ్డి

నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన లైంగిక దాడి ఉదంతంపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను మహిళా భద్రతా విభాగానికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

dgp-mahender-reddy-ordered-department-of-womens-safety-monitor-minor-girl-sexual-assault-case-nirmal
'మైనర్ బాలిక లైంగిక దాడి కేసును పర్యవేక్షించండి'

By

Published : Mar 11, 2021, 10:08 PM IST

నిర్మల్ జిల్లా బైంసాలో.. మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించాలని డీజీపీ మహేందర్ రెడ్డి.. మహిళా భద్రతా విభాగాన్ని ఆదేశించారు. ఘటనపై తక్షణమే స్పందించి.. నిందితులను పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు.

కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను గుర్తించి,.. దర్యాప్తు ప్రక్రియ వేగవంతమయ్యేలా కృషి చేయాలని డీజీపీ సూచించారు. నిందితులకు త్వరగా శిక్ష పడే విధంగా చూస్తామని తెలిపారు. బాధిత బాలికకు వైద్య సహాయాన్ని అందించాలని భద్రతా విభాగాన్ని కోరారు.

ఇదీ చదవండి:వెలుగులోకి మరో పెట్రోల్​ బంకు మోసం

ABOUT THE AUTHOR

...view details